CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసి ఆయన..ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌తో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.
Uttar Pradesh Assembly Election 2022: కాశీలో తన చావును కోరుకుంటూ గతంలో కొంతమంది బహిరంగ వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. అందుకు తాను సంతోషించానని చెప్పుకురావడం గమనార్హం.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్‌వాదీ పార్టీ. 159 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.
Akhilesh Yadav to contest Assembly Election : ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. 2012లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఆ పదవిలో కొనసాగారు.
UP elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు.
అపర్ణ యాదవ్ బీజేపీలో చేరికపై ఆ పార్టీ పెద్దలు కొద్ది రోజులుగా ఆమెతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
Samajwadi Party alliance with Azad Samaj Party:ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శనివారం (జనవరి 15) మధ్యాహ్నం 12.30గంటలకు నిర్వహించే జాయింట్ ప్రెస్ మీట్లో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
Dharam Singh Saini: యూపీ రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కీలక నేతలంతా భాజపాను వీడుతున్నారు. తాజాగా మరో మంత్రి కాషాయపార్టీని వీడారు.
Samajwadi MP shocking comments over raising marriage age of women:సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మహిళల వివాహ వయసు పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒకరు మహిళల వివాహ వయసును ఫర్టిలిటీతో ముడిపెట్టగా.. మరొకరు పేదరికంతో ముడిపెట్టారు. ఈ ఇద్దరి కామెంట్స్‌పై స్పందించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు.
Case filed against Mark Zuckerberg : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ పై కేసు నమోదైంది. యూపీలోని కన్నౌజ్ జిల్లాలోని కోర్టులో పరువు నష్టం కలిగిందంటూ కేసు నమోదైంది.
Akhilesh Yadav 2022 Uttar Pradesh assembly polls:ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు.
SP-AAP Alliance: దేశం మొత్తం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తి కనబరుస్తుంటుంది. అందుకే ఏడాది ముందే ఎన్నికల వేడి మొదలైపోయింది. పార్టీల మధ్య పొత్తు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రానున్న యూపీ ఎన్నికల్లో ఆప్, సమాజ్‌వాది పార్టీల మధ్య పొత్తు యత్నాలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
నిన్న లక్నో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చకు రావాలని సవాలు చేసిన ఒక రోజు తరువాత, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ అభివృద్ధి, నిరుద్యోగం,రైతు సమస్యలపై ముందు చర్చించాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.