Ambati Rambabu: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
Ambati Rambabu: తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.
Ambati Rambabu Tests Positive for COVID-19: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కానీ కరోనా వైరస్ రెండోసారి సోకుతుండటం ఏపీ ప్రజలతో పాటు నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.