బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
BJP leader Shot Dead In Bihar | బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు.
బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ ( Dk Aruna ), ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ( Daggubati Purandeswari ) జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది.
బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అదే రాష్ట్రంలోని ఉజియర్పూర్ లోక్ సభ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌తో జీ హిందుస్తాన్ కాసేపు ముచ్చటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కేంద్రంపై ప్రస్తుతం బీహార్‌లో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ? బీహార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి ? బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండనున్నాయి ? ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొని ఉందనే అంశాలను మా జీ హిందుస్తాన్ యాంకర్ మాధురి కలాల్ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.