JDU, BJP seal 50:50 seat-sharing formula in Bihar election: పాట్నా: బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరు పార్టీలూ కలిసి చెరోసగం సీట్లల్లో (50:50) పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఉన్న 243 అసెంబ్లీ సీట్లుకు గాను జేడీయూ 124 (JDU) సీట్లలో, బీజేపీ 119 (BJP) సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన హిందుస్తాన్ అవామ్ మోర్చా, లోక్ జనశక్తి పార్టీ (LJP) కి సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారికి సీట్ల కేటాయింపు తర్వాత ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది తెలియనుంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్
ఈ మేరకు సీట్ల పంపకాలపై ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda) నివాసంలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీహార్ బీజేపీ కీలక నేతలతో చర్చించారు. అయితే ఈ సమావేశంలో జేడీయూ, బీజేపీ మధ్య చెరో 50శాతం సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జీతన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (Hindustani Awam Morcha), అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (LJP) కి సీట్ల కేటాయింపుపై కూడా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అయితే అంతకుముందు సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఎల్జేపీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించారు. ఆతర్వాత బీజేపీ సయోధ్యతో ఈ గొడవ సద్దుమణిగింది. భేటీ కావాల్సిన సమయంలో.. రామ్ విలాస్ పాశ్వాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం పాశ్వాన్‌కు హార్ట్ ఆపరేషన్ జరిగడంతో సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. Also read: Harthras Case: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 28న, నవంబర్ 3, 7వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా.. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. మొదటి విడుతకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా.. నామినేషన్ ప్రక్రియ 8తో ముగియనుంది. Also read: Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు