Jagtial MLA Dr Sanjay Kumar Father Died: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. విషయం తెలుసుకున్న గులాబీ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
Singer Madhu Priya:ఫోక్ సింగర్ మధుప్రియ కాంగ్రెస్ పార్టీలోక చేరుతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ మధుయాష్కిని కలవడం ప్రస్తుతం తీవ్ర రచ్చకు దారితీసింది. ఫోక్ సింగర్ గా మధుప్రియ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Kadiyam Kavya Withdraw Form Lok Sahba Poll: తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇతరులను కాదని లోక్‌సభ టికెట్ ఇస్తే కడియం కావ్య నిరాకరించింది. మొదట పోటీకి సై చెప్పి వారం రోజులకు ఊహించని విధంగా ఎన్నికల నుంచి వైదొలగింది. ఈ పరిణామం కలకలం రేపింది.
KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
KT Rama Rao Challenge To Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
KT Rama Rao Legal Action On YouTube Channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై మాజీమంత్రి కేటీఆర్ యుద్ధం ప్రకటించారు. పరువు నష్టం ధావాలతోపాటు, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా కీలక హెచ్చరిక చేశారు.
KCR Welcomes RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులకు భరోసానిస్తూనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Lok Sabha Elections: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సరికొత్త జోష్వచ్చింది. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్నారు. ప్రవీణ్‌కుమార్ చేరికతో గులాబీ దళంలో కొత్త ఉత్సాహం వచ్చింది.
Modi Responds About Kavitha Arrest: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు.
BRS Party 100 Questions On Revanth Rule: కాంగ్రెస్ అధికారంలోకి వంద రోజులు పూర్తవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధించింది. రేవంత్ రెడ్డి వంద రోజుల పాలనపై వంద ప్రశ్నలు సంధించింది.
Congress Party: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ గూటికి, ఇటూ బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెలో పార్టీలో చేరడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
Telangana cantonment Bypoll: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని భాగంగా తెలంగాణలోని కంటోన్మెంట్ పరిధిలో ఏర్పడిన ఖాళీకి కూడా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈక్రమంలో తాజాగా, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
BRS Party Candidates: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం మార్చింది. విజయమే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ కేసీఆర్ సరికొత్త వ్యూహం పన్నుతున్నారు. తాజాగా మరో రెండు స్థానాలకు....
Kavitha Not Contesting In Nizamabad: పుట్టినరోజు నాడు కుమార్తెకు కానుక ఇవ్వాల్సింది పోయి మాజీ సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కవితనే కాదు రాజకీయ వర్గాలను కూడా విస్మయం వ్యక్తం చేశాయి.
KCR Sensational Comments On Revanth Reddy: గులాబీ దళపతి కేసీఆర్ టీవీ ముందు కూర్చోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు త్వరలోనే టీవీ చానల్ ముందుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అతడు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.
KCR Fire On Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS Party MP Candidates: అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన గులాబీ పార్టీ ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు, ఇద్దరు మాజీలకు అవకాశం కల్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.