Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

Modi Responds About Kavitha Arrest: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 05:14 PM IST
Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

Modi Vs Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కవిత అరెస్ట్‌ అంశంపై ఆయన స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాలతోపాటు తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన పరిణామాలపై స్పందిస్తూ కవిత అరెస్ట్‌ అంశాన్ని ప్రస్తావించారు.

Also Read: Narendra Modi: నేను ప్రధానినే కాదు.. నేను భారతమాత పూజారిని: జగిత్యాల సభలో మోదీ

 

'కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ కుంభకోణంలోనూ కమీషన్లు తీసుకుంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు అవినీతికి పాల్పడ్డారు' అని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఎంత కవర్ ఫైర్ చేసినా.. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

Also Read: Kavitha: కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్ రావు.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం

'కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బీఆర్‌ఎస్ చేరింది. కుటుంబ పార్టీ అయిన బీఆర్‌ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసింది' అని తెలిపారు. కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీని, మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News