Fengal Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తమిళనాడు-శ్రీలంక ప్రాంతాలపై ప్రభావం చూపించనుంది. ఈ తుపానుకు ఫెంగల్ అని పేరు పెట్టారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు కూడా వీయనున్నాయి.
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను కారణంగా తమిళనాడులో ఇవాళ స్కూల్స్, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలో దింపింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో తమిళనాడు, పుచుచ్చేరి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా కారైకాల్, తంజావురు, తిరువాలూరు, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచే భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏ ప్రాంతాల్లో ఏ అలర్ట్
భారీ వర్షాల కారణంగా నవంబర్ 27 నుంచి 29 వరకూ మూడ్రోజులు చెన్నైలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక నవంబర్ 27 నుంచి 30 వరకూ కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టులో ఆరెంజ్ ఎలర్ట్ జారీ అయింది. చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూరు సహా 9 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులిచ్చేశారు. తమిళనాడులోని కోస్తా ప్రాంతంలో రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి. తుపాను కారణంగా ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా రేపు ఈ రెండు జిల్లాల్లో వర్షాలు పడవచ్చు.
Also read: New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.