Mohammad Siraj vs Zanai Bhosle: టీమ్ ఇండియా స్టార్ పేసర్, డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్ ఓ సింగర్‌తో ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా ఇద్దరి ఫోటో కూడా వైరల్ అవుతోంది. నిజంగా ఈ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా లేక ఫోటో వరకే పరిమితమా అనేది పరిశీలిద్దాం. ఇద్దరూ నవ్వుకుంటుండగా క్లిక్ చేసిన ఫోటో చాలా హల్‌చల్ చేస్తోంది.
భారత జట్టు స్టార్ పేస్ బౌలర్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. డీఎస్పీ సాబ్ ప్రేమలో పడ్డారంటూ కామెంట్లు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సింగర్ జనై బోస్లే మొహమ్మద్ సిరాజ్‌తో ఉన్న ఫోటోను ఇటీవల తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇద్దరూ పక్కపక్కన కూర్చుని నవ్వుకుంటున్నారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోటోను స్వయంగా సింగర్ జనై బోస్లే షేర్ చేసింది. అంతే డీఎస్పీ సాబ్ ప్రేమలో పడ్డారంటా ప్రచారం ఊపందుకుంది.
ఎవరీ జనై బోస్లే, ఏమా కధ
ప్రముఖ గాయని ఆశా బోస్లే మనుమరాలే జనై బోస్లే. ఈమె ఇటీవల ముంబైలో తన 23వ పుట్టినరోజు వేడుకల ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మొహమ్మద్ సిరాజ్‌తో కూడా ఓ ఫోటో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవుతున్న వాళ్లే. అందునా స్వయంగా జనై బోస్లే షేర్ చేసిన ఫోటో కావడంతో ఇక ప్రచారం ఊపందుకుంది. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ పుకార్లకు బలం చేకూరుతోంది. ఈమె పుట్టిన రోజు వేడుకలకు మొహమ్మద్ సిరాజ్‌తో పాటు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, నటుడు జాకీ ష్రాప్ కూడా హాజరయ్యారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
కొందరు జనై బోస్లేకు పుట్టినరోజు విషెస్ చెబుతుంటే ఇంకొందరు నేరుగా వరుస కలుపుకుని మాట్లాడేస్తున్నారు. భాబీ..మీరు సిరాజ్ భాయిజాన్‌ని పెళ్లి చేసుకుంటున్నారా అంటా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే డీఎస్పీ సాబ్ యహా మై పిగల్ గయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొహమ్మద్ సిరాజ్ ఈసారి ఐపీఎల్‌లో గజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ..భాబీనే గుజరాత్ టైటాన్స్ కో ఫాలో కియా...క్యూంకే డీఎస్పీ హై ఇస్ బార్ గుజరాత్ మే అంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు అందుకుంటున్నారు. జనై బోస్లే-మొహమ్మద్ సిరాజ్ ఫోటో బాగా హల్‌చల్ చేస్తోంది.
ఈ ఫోటోపై లేదా కామెంట్లపై అటు మొహమ్మద్ సిరాజ్ లేదా ఇటు జనై బోస్లే స్పందించలేదు. ప్రేమ వ్యవహారం నిజమా కాదా అనేది అభిమానుల్నే తేల్చుకోమని వదిలేసినట్టున్నారు.
Also read: PF ATM Withdrawal: పీఎఫ్ ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి, కొత్త విధానం ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి