Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
YSRCP Election Campaign: ఏపీలో మరో 70 ఎన్నికలు రానున్నాయని.. వైసీపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
CM Jagan With India Today: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఇండియా టుడే సదస్సులో అన్నారు.
Chandrababu Naidu on CM Jagan: సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యపై మాట్లాడే దమ్ము సీఎం జగన్‌కు ఉందా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌కు బాబాయ్ ప్రాణాలే లెక్కలేదని.. ఇక మనం ఓ లెక్కా అని అన్నారు. కడప జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.
CM Jagan with YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం వేడుక గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. మేనల్లుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థం వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు హాజరై.. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులు సందడి చేశారు.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో మరింత దూకుడుగా వ్యహరిస్తోంది. ఇప్పటికే మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఇంఛార్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. పలుచోట్ల సిట్టింగ్‌లను మార్చింది.
Narreddy Sunitha Reddy: ఒక గట్టున అన్నయ్య .. మరో గట్టున చెల్లెళ్లు .. వెరసి ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్లు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ ఒకప్పుడు వదిలిన బాణం ఇప్పుడు తిరగబడగా.. అదే బాటలో మరో చెల్లెలు రంగంలోకి దిగబోతున్నారు. దీంతో ఒక అన్న .. ఇద్దరు చెల్లెళ్ల రాజకీయ పోరాటం ఏ మలుపు తిరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Machilipatnam MP Balashowry Resigns: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
MP Sanjeev Kumar Resigns to YSRCP: వైసీపీ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్. తనకు పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామనేది కేవలం స్టేట్మెంట్ మాత్రమేనని అన్నారు.
YCP Lok Sabha Candidates List: 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలుగా ఈసారి సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల సిట్టింగ్‌ల స్థానంలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.
AP Politics: వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరగా.. మరో ఎమ్మెల్సీ జనసేన పార్టీలో చేరారు.
MLA MS Babu Comments On CM Jagan: సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పని తీరు బాగోలేదంటూ దళిత ఎమ్మెల్యేలకే ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. కేవలం దళితులు ఉన్న చోటే అభ్యర్థులను మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Jagan Mohan Reddy Vs YS Sharmila: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? సొంత అన్నను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇదే భయం ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోందా..? అందుకే చెల్లెలు పుట్టింటికి రాకుండా జగన్ రాయభారం పంపారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.