Global Investment Summit 2023: విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండురోజుల పాటు జరిగి ఈ సమ్మిట్‌లో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వమించనున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రమంతా ఫోకస్ చేస్తోంది.
CM Jagan Review On Power Sector: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించాఉఉ. బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: కైకలూరులో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Chandrababu Naidu Slams Ap Cm Jagan Mohan Reddy: ఏపీ రాజధానిగా అమరాతిని అభివృద్ధి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అమరాతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చెప్పారు. ప్రజాకోర్టులో జగన్ మోహన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా టీడీపీ పోరాడుతుందన్నారు.
CM Jagan Mohan Reddy Review Meeting: ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు తెలంగాణ కంటే అధికంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని చెప్పారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకురావడంతో ఆదాయాలు మెరుగుపడుతున్నాయన్నారు.
CM Jagan Govt On Old Pension Scheme: ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇలా..
కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. సీఎం జగన్ ఓఎస్డీ, వైఎస్ భారతీరెడ్డి పీఏను విచారించారు.
CM Jagan Mohan Reddy On Jagananna Chedodu: జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయం సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. కుల వృత్తులకు చెందిన వారు పెట్టుబడి కోసం జగనన్న చేదోడు పథకం కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎల్లో మీడియా వారికి వంత పాడుతుందన్నారు. పూర్తి వివరాలు ఇలా..
CM Jagan Review On R and B Department: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
CM Jagan Review On Higher Education Department: డిగ్రీ విద్యా వ్యవస్థంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిగ్రీ పూర్తయ్యే నాటికి స్వయం ఉపాధి అందేలా కోర్సులు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. విదేశాల్లో కోర్సులు పరిశీలించాలని సూచించారు.
Comedian Ali On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమంటూ కమెడియన్ అలీ ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని అన్నారు. అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
CM Jagan Review On School Education Department: వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలన్నారు.
జగన్ సర్కార్‌పై జనసేన నాయకుల ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల నోరెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 12న రణస్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Pawan Kalyan Supports To Chandrababu Naidu: కుప్పం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే.. మరో ఎమ్మెల్యే సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.