కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్‌ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి.
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తంచేస్తూ లాక్ డౌన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత కూడా కరోనావైరస్ కోవిడ్ హాట్ స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.