Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల వెనుక స్మితా సబర్వాల్‌.. ఆమె ఏం చేశారో తెలుసా?

Smita Sabharwal Behind Of Miss World 2025 In Hyderabad: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ మరోసారి విశ్వవ్యాప్తం కాబోతోంది! తొలిసారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్ వేదికగా నిలవబోతోంది. మిస్‌ వరల్డ్‌ పోటీలు రావడం వెనుక సీనియర్ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వార్‌ ఉన్నారా..! ఆమె కృషితోనే నగరంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్నాయా..! 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2025, 02:51 PM IST
Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల వెనుక స్మితా సబర్వాల్‌.. ఆమె ఏం చేశారో తెలుసా?

Miss World 2025 Smita Sabharwal: విశ్వనగరం హైదరాబాద్‌ మరో ప్రపంచ స్థాయి వేదికగా రెడీ అవుతోంది.. హైదరాబాద్ నగరంలో తొలిసారి మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగబోతున్నాయి. ఈ ఏడాది మే 4 వ తేదీ నుంచి 31 వరకు జరిగే పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ టూరిజం శాఖ చూస్తోంది. గ్రాండ్ ఫినాలే సహా ఇతర ముఖ్యమైన ఈవెంట్లు నగరంలో జరుగుతుండగా.. ఇందులో మొత్తం 140 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు భారత్‌లో రెండుసార్లు మిస్ వరల్డ్‌ పోటీలు జరిగితే.. మూడోసారి మాత్రం మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కాబోతుంది. అయితే మిస్‌ వరల్డ్‌ పోటీల కోసం దేశంలోని అనేక నగరాలు పోటీపడితే.. ఈసారి హైదరాబాద్‌కు ఈవెంట్‌ రావడం వెనుక మాత్రం తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్‌ ఉన్నారని చెప్పాలి. ఆమె కృషి వల్లే నగరంలో మిస్ వరల్డ్‌ పోటీలకు నగరం వేదిక కాబోతోంది. దాంతో స్మితా సబర్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: Free Bus: మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ఉందా?

ఇక తెలంగాణ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్‌ టూరిజం శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఏడాది మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియగానే అలర్ట్ అయ్యారు. ఈసారి హైదరాబాద్ నగరంలో మిస్‌ వరల్డ్‌ పోటీల కోసం ప్రభుత్వం తరపున సౌకర్యాలు కల్పిస్తామని ఒప్పించారు. మరోవైపు మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించేందుకు ముంబై గట్టిగానే ప్రయత్నించింది. కానీ స్మితా సబర్వాల్‌  మాత్రం గట్టిగా ప్రయత్నించి హైదరాబాద్ కు అవకాశం వచ్చేలా చేశారు. ఇక మిస్ వరల్డ్ పోటీలపై గ్లామర్ వరల్డ్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలు వస్తారు. అంతే కాదు.. ఈ పోటీలను విభిన్నమైన ప్రాంతాల్లో వేర్వేరు విభాగాల్లో నిర్వహిస్తారు. అవన్నీ తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కనున్నాయి.

Also Read: Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు

ప్రస్తుతం టూరిజం పరంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఇందులో చాలా ప్రాంతాలు టూరిజం స్పాట్‌లుగా వేటికవే ప్రత్యేకం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చార్మినార్‌, గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మరోవైపు యాదాద్రి క్షేత్రం, వరంగల్‌ జిల్లాలోని రామప్ప టెంపుల్‌, భద్రాద్రి, జోగులాంబ, నల్గొండ జిల్లాలోని  బుద్దావనం లాంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. కానీ వీటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు స్మితా సబర్వాల్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీలతో ఆ ప్రచారం కాస్తా ప్రపంచ వ్యాప్తం అవుతుందని స్మితా సబర్వాల్‌ భావిస్తున్నారు.

అలా వచ్చి.. ఇలా చేసి

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాలో సీఎంవోలో పనిచేసిన స్మితా సబర్వాల్‌.. ఆ తర్వాత రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్‌లో సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టూరిజం సెక్రటరీగా స్మితాకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఎప్పుడైతే టూరిజం శాఖ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచే డిపార్ట్‌మెంట్‌ను ఉరుకులు పరుగులు పెట్టించడం మొదలు పెట్టారట మేడమ్‌. టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే అతి తక్కువ సమయంలో తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించారు. దాంతో అసెంబ్లీ సమావేశాల్లో టూరిజం పాలసీపై ప్రత్యేక చర్చ జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా టూరిజం పాలసీ రూపొందించడంతోనే స్మితా సబర్వాల్ పని అయిపోలేదు.

తాజాగా తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన ఓ వీడియోను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా బయటకు వదిలారు మేడమ్‌ స్మితా.. తెలంగాణ- జరూర్‌ ఆనా యాష్‌ ట్యాగ్‌తో ఆమె వదిలిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. మొత్తంగా మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణతో తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ మరోసారి మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News