TRS vs BJP In Dubbaka By Election Results : వరుసగా మూడు రౌండ్లలో అధికార టీఎర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 13, 14, 15 మూడు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్‌గా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. వరుసగా మూడు రౌండ్లలో కారు దూసుకెళ్లింది. రౌండ్ రౌండ్లో ఫలితాలు, ఆధిక్యాలు మారిపోతున్నాయి.
Dubbaka Bypoll Results Live Updates | దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 353 ఓట్ల ఆధిక్యం, ఏడో రౌండ్లో సుజాత రెడ్డికి 182 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే ఇది స్వల్ప ఆధిక్యం కావడంతో 8వ రౌండ్ ఫలితాలో దుబ్బాకలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ వచ్చింది.
Dubbaka Bypoll Results Live Updates | దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి మూడు రౌండ్ల లెక్కింపు అనంతరం దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Dubbaka By Election Counting Begins: దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహా మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
తెలంగాణలో రాజకీయం ఉద్రిక్తతకు దారితీస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
Anchor Kathi Kartika in cheating case: హైదరాబాద్: యాంకర్, బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కత్తి కార్తిక గతంలో ఓ భూ వివాదాన్ని సెటిల్ చేస్తానని నమ్మించి తన వద్ద కోటి రూపాయల కాజేసినట్టు ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.