తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.