BJP Telangana Chief Bandi Sanjay Kumar: తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.
Vijayashanti Joins In BJP | సీనియర్ నటి విజయశాంతి తిరిగి భారతీయ జనతా పార్టీ (BJP) గూటికి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో పార్టీలోకి విజయశాంతి చేరారు. కీలక నేత అరుణ్ సింగ్ కాషాయ కండువాను కప్పి సినీ నటిని పార్టీలోకి ఆహ్వానించారు.
Vijayashanti Likely To Join BJP: తాజాగా ఆమె రాజకీయ భవితవ్యం ఏంటనే అంశంపై తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయశాంతి రాజకీయం ఎటువైపు దానిపై స్పష్టత లభించింది. రేపు ఉదయం భారతీయ జనతా పార్టీలో విజయశాంతి చేరనున్నారు. లేడీ సూపర్ స్టార్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయశాంతి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన బీజేపిలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ మరింత నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది.
High Court of Telangana | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కౌంటింగ్ సరికొత్త మలుపుతిరిగింది. కొద్ది రోజుల క్రితం బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపుతో ఏ గుర్తు వేసినా ఓటేసినట్లుగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పట్టున్న స్థానాలన్నింటిని కైవసం చేసుకోని మూడో స్థానంలో నిలించింది ఎంఐఎం పార్టీ. 2016 ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 200 నుంచి 300 మధ్య ఓట్ల తేడాతోనే ఓటమిపాలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్టుగా మరో 20-25 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భావించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
GHMC Election 2020 Counting: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఫైర్ అయ్యారు.
GHMC Elections 2020: ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా రీతిలో సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మాత్రం నిరాశపరుస్తోంది. పోలింగ్ భారీగా తగ్గిపోయింది. మరిప్పుడు తగ్గిన ఈ పోలింగ్ శాతం ఎవరికి ప్రయోజనం కల్గించనుంది..ఎవరికి నష్టం చేయనుంది. విశ్లేషణ మీ కోసం..
Telugu Memes On GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల కోసం నేతలు, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసి, పోలీసులు చేయాల్సినవి అన్ని చేశారు. కానీ హైదరాబాదీ ప్రజలే చేయాల్సినవి చేయలేదు అని అంటున్నారు నెటిజెన్లు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.