Epf: ఈపీఎఫ్ వో వేతన పరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. EPFO కార్పస్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగుల సహకారం కోసం ప్రస్తుత వేతన పరిమితి రూ.15,000 పెంచే అవకాశం ఉంది.
PF Account Withdrawal Limit Increased: ఈఫీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.50 వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రూ.లక్షకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న వినియోగాలకు అనుగుణంగా లిమిట్ పెంచినట్లు చెప్పారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
EPFO Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఇన్వెస్ట్మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ EPFని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేస్తోంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ప్రతి నెలా వారి బేసిక్ పే జీతంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని సహకారం కూడా 12 శాతం ఉంటుంది. ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ని ఎంచుకుంటే.. మరింత ఎక్కువ కంట్రీబ్యూషన్ చేసుకోవచ్చు. రూ.3.3 కోట్లు కార్పస్‌ను ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందా..
EPFO Minimum Pension: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)తో ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఈ పథకం కింద 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలలలో పొందిన సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌ను అందుకుంటారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు.
EPFO Latest Updates: ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు బంపర్ న్యూస్. పదవి విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో పొదుపు చేయడం ఉత్తమం మార్గం. ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. అయితే ఇందులో ఈపీఎఫ్‌కు 3.67 శాతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 8.33 శాతం జమ అవుతుంది. పదవీ విరమణ కోసం భారీ మొత్తంలో మంచి కార్పస్‌ను ఎలా రూపొందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
EPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మీరు గరిష్టంగా 43 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
EPFO Latest News: పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద సంఘటిత రంగంలోని కార్మికులు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌కు పొందేందుకు అర్హులవుతారు. ఒకే యూఎఎన్ కింద కనీసం పదేళ్లు అయినా పనిచేసిన వారికి పెన్షన్ పొందుతారు. మొత్తం 7 రకాల పెన్షన్లు పొందొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్ఓలో కంట్రిబ్యూట్ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్ చెబుతున్నాయి. ఆ పెన్షన్ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది.. కానీ ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనల ప్రకారం ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందవచ్చు. అయితే, ఏడు రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. అది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగి కూడా ఇది వర్తిస్తుంది.ఈపీఎఫ్ఓ ద్వారా 7 రకాల పెన్షన్లు ఉద్యోగులు పొందవచ్చు. ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే, ప్రతిఒక్కరూ ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి.
EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్ఓ. తాజా అప్డేట్స్ మీ కోసం..
EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు. తప్పులను కూడా సరిదిద్దడానికి, దానికి సంబంధించిన పత్రాలను జతచేయాలి. కొత్త సూచనల ప్రకారం..ఈపీఎఫ్ వో ప్రొఫైల్‌లోని మార్పులను చేసుకునేందుకు వీలుంటుంది.
EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను EPS-95 అని పిలుస్తారు.దీన్ని EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం.ఇందులో సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ గా చేయాల్సి ఉంటుంది.ఈ మొత్తంపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
7 Lakhs Free Insurance: ఈపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు ముఖ్య గమనిక. పీఎఫ్ ఖాతాదారులకు 7 లక్షల ఉచిత బీమా సదుపాయం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
UAN Card Download: పాన్‌కార్డు, ఆధార్ కార్డులానే యూఏఎన్ కార్డు ఒకటుందనే విషయం తెలుసా. మీ పీఎఫ్ వివరాలకు సంబంధించిన కార్డు ఇది. అసలీ యూఏఎన్ కార్డు అంటే ఏమిటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
EPF Interest Rate Credit Status: ఈపీఎఫ్‌లో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని ఖాతాదారులు అందుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా వడ్డీ జమ చేయలేదు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ స్పందిస్తూ.. త్వరలోనే వడ్డీ జమ చేస్తున్నట్లు వెల్లడించింది.
EPFO New Rules: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కీలకమైన అప్డేట్ ఇది. మీ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈపీఎఎఫ్ఓ ఈ మేరకు ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mobile Number Linking: పీఎఫ్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం లేదా అప్డేట్స్ అనేవి మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంటాయి. అందుకే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు లింక్ అవడం తప్పనిసరి. మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే భవిష్యత్తులో చాలా విషయాలకు ఇబ్బందిగా మారుతుంది.
PF Death Claim Rules: మీరు ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ హోల్డర్ అయుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ లేదా నిబంధనల్లో మార్పులు గమనిస్తుండాలి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ తాజాగా డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.
EPFO New Rule: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సులభంగా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రతి ఉద్యోగి పీఎఫ్ వ్యవహారాలు చూసేది ఈ శాఖే. ఎప్పటికప్పుడు మార్పులు, సూచనలు చేసే ఈపీఎఫ్ఓ మరికొన్ని రూల్స్ మార్చింది. కొత్త రూల్స్ ఖాతాదారులకు మరింత ప్రయోజనం కల్గించనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
PF Withdrawal: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సేవింగ్ స్కీమ్ వర్తిస్తుంది. అటు ఉద్యోగి, ఇటు సంస్థ తరపున పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.