Pancha Brahma Lingeshwara Temple specialities: దేశంలోనే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా (పంచబ్రహ్మలు) కలిపి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడమే ఇక్కడి ప్రత్యేకత.
Devaragattu Bunny Festival 2021 Nearly 100 injured: కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో హింస చెలరేగింది. దీంతో సుమారు వంద మందికి గాయాలయ్యాయి.నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
AP HRC Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో హెచ్ఆర్సి కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది.
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.
Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.
aarogyasri trust jobs 2020 Kurnool | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.
వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం సుబ్బారాయుడు వాకింగ్‌కు వెళ్లగా మాటువేసిన కొందరు దుండగులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేసి దారుణహత్య (YSRCP Leader Murdered In Kurnool District)కు పాల్పడ్డారు.
రోజులు మారిపోయాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అయినా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. దీంతో ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడులకు (Nandyal Acid Attack) పాల్పడుతోంది. ఈ వారంలో రెండోసారి యాసిడి దాడికి పాల్పడిందని సమాచారం.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
Man Commits Suicide | ఏపీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాదాపు వంద కరోనా మరణాలు సంభవించాయి. కేసుల తీవ్రత సైతం కేవలం రెండు, మూడు జిల్లాల్లో దారుణంగా ఉంది. ఈ క్రమంలో కరోనా సోకిందేమోనన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్‌ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.