L Ramana to join TRS soon: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ స్పష్టంచేశారు. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎల్ రమణ (L Ramana meets CM KCR).. అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
TPCC Chief Revanth Reddy: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే దానం ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
Konda Vishweshwar Reddy supports Eetela Rajender: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు మంత్రి కేటీఆర్‌కు లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితు, పలువురు నేతల తీరుతెన్నులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Putta Madhu arrested by Ramagundam police: మంథని: రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్యపై వామన్ రావు తండ్రి కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, కోడలు హత్య వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందని కిషన్ రావు ఆరోపించారు. ఆ మాజీ మంత్రి అండదండలతోనే ఒక పథకం ప్రకారం వామన్ రావు దంపతులను (Advocate couple Vaman Rao murder case) పుట్టా మధు హత్య చేయించాడని కిషన్ రావు వాపోయారు.
Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇవాళ కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కీలకాంశాలపై చర్చించారు.
జనగాం: జనగాం జిల్లా కేంద్రానికి సమీపంలోని యశ్వంతపూర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఊహించనిరీతిలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం పక్కనపెట్టి అక్కడి గ్రామ మాజీ సర్పంచ్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 200 నుంచి 300 మధ్య ఓట్ల తేడాతోనే ఓటమిపాలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్టుగా మరో 20-25 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భావించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి ఉండుంటే మేయర్ పదవి బీజేపి కైవసం అయ్యుండేది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన సీన్ ని మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు.
Cheruku Srinivas Reddy joins congress ahead of Dubbaka by election: హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ దివంగత నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో దుబ్బాక నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన దుబ్బాక ముత్యంరెడ్డి కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ పట్టు ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి చేరిక తమ పార్టీకి కలిసొచ్చే అంశం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST act POA 1989 ) నమోదైంది. యాచారం ఎంపీపీ సుకన్య చేసిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ.. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన తెలిపామని, త్వరలో భావసారూప్యత గల ముఖ్యమంత్రులతో సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.