MLC Kavitha going to home quarantine: హైదరాబాద్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు. ఈ మేరకు కవిత ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండటంతపాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాలని కోరూతూ సంజయ్ కుమార్ ట్విట్ చేసిన కోరారు. Also read: Nizamabad MLC Bypoll 2020: భారీ మెజార్టీతో కవిత విజయకేతనం
I wish for your speedy and healthy recovery Anna. As I recently came in contact with you, I’ll be quarantining myself for next 5 days as a precautionary measure. I humbly request @trspartyonline cadre to avoid visiting my office for next few days. https://t.co/7Meoco2UCZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2020
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్యే సంజయ్ త్వరగా కోలుకోవాలంటూ మంగళవారం సాయంత్రం ట్విట్ చేసి ఆకాంక్షించారు. ఎమ్మెల్యేతో కాంటాక్ట్‌లోకి రావడం వల్ల తాను అయిదు రోజుల పాటు క్వారెంటైన్‌లోకి వెళ్లనున్నట్లు కవిత తెలిపారు. 5 రోజుల పాటు తన ఆఫీసుకు ఎవరూ రావొద్దంటూ టీఆర్ఎస్ (TRS) శ్రేణులను, తన మద్దతుదారులను కోరుతూ కవిత ట్విట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe