తెలంగాణ ఐసెట్ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ర్టంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల వేడి నెలకొంది. ప్రచారంలో ప్రాధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటల తూటాలతో విమర్శించుకుంటున్నాయి. మరికొన్నిగంటల్లోనే దుబ్బాక ఎన్నికల (Dubbaka Bypoll) ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (K. T. Rama Rao) ఆసక్తికరమైన ట్విట్ చేశారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.
కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali Kata) కి కీలక పదవి దక్కింది. ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఆర్య సమాజ్ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు.
బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మధునగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సుమారు ఎనిమిదేళ్లుగా బుల్లితెర నటిగా పనిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా ( Illegal liquor In AP ) ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని నెలల నుంచి లాక్షలాది రూపాయల మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు పట్టుకుంటునే ఉన్నారు. అయినప్పటికీ మద్యం అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.