Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Ys Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యల్ని ప్రజల ముంగిటే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇలా కొనసాగనుంది.
YS Sharmila party in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె చేసిన కామెంట్స్ ఏమిటో చూడండి.
చేవెళ్ల నుండి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఎనిమిదవ రోజు పూర్తయ్యే సరికి మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. షర్మిలతో పాటు ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్యామల కూడా పాదయాత్రలో పాల్గొనటం విశేషం.
YSRTP chief YS Sharmila about Huzurabad bypolls: సీఎం కేసీఆర్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆయనపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) పోటీ చేయడాన్ని ఓ మార్గం ఎంచుకున్నారని.. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినప్పుడు, వారికి రోజుకో రకమైన రూల్ పెడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిప్పి పంపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Ys Sharmila Padayatra: తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం నడుస్తోంది. కాంగ్రస్, బీజేపీలకు తోడు వైఎస్సార్టీపీ పాదయాత్ర చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
YS Sharmila meeting with Prashanth Kishore: హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ (Huzurabad bypolls schedule) వెలువడిన నేపథ్యంలో హూజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి అనే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
YS Sharmila comments On Telangana CM KCR: ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
YSR Telangana Party: తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. ఊహించినట్టే వైఎస్ షర్మిల కొత్త పార్టీకు అంకురార్పణ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని..వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రారంభించారు. పార్టీ జెండాను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు.
YS Sharmila slams Telangana CM KCR: హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.. ''అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు'' అంటూ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు.
Ys Sharmila Deeksha: తెలంగాణలో వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన దీక్షను ఇవాళ విరమించారు. అమరవీరులు, నిరుద్యోగ కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిలతో దీక్ష విరమింపజేశారు.
Ys Sharmila Deeksha: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన. ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. మరి షర్మిల దీక్షకు ఎవరెవరి మద్దతు లభించనుందనేది ఆసక్తిగా మారింది.
Ys Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. చరిత్రలో కనీవినీ లేని విధంగా సభ ఉండాలని వైఎష్ షర్మిల భావిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన అత్యంత వైభవంగా ఉండాలంటున్నారు.
Ys Sharmila: తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ సంచలనం కల్గిస్తోంది. త్వరలో పార్టీ ప్రకటన వెలువడనుంది. ఖమ్మం బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. మరి ఖమ్మం తరువాత షర్మిల ఫోకస్ పెట్టనున్న మరో జిల్లా ఏంటనేది ఆసక్తిగా మారింది.
YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. రాజకీయ పార్టీ ప్రకటనతో సంచలనం రేపిన షర్మిల వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.