Zee telugu Mahasangamam with trinayani and Mukkupudaka: ముక్కుపుడక- త్రినయని రెండు సీరియల్స్ మహా సంగమం పేరిట క్రాస్ ఓవర్ ప్లాన్ చేశారు. జులై 20వ తేదీ అంటే బుధవారం రాత్రి 8 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మెగా ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Pelli SandaD Television Premier : పెళ్లి సందD సినిమాను జూలై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయడానికి జీ తెలుగు రంగం సిద్ధం చేసింది.
Zee Telugu Dance India Dance Auditions: సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను, అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందించిన జీ తెలుగు సరికొత్త రియాలిటీషోతో వస్తోంది. జూలై 3న ఈ రియాలిటీ షో యొక్క చివరి దశ ఆడిషన్స్ రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్నాయి.
Radhe Shyam in Zee Telugu: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యాం సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Zee Telugu Dance India Dance Auditions: అనేక రియాలిటీ షోలు నిర్వహించి తద్వారా సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను, అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందించిన జీ తెలుగు ఈసారి సరికొత్త రియాలిటీషోతో మన ముందుకు వస్తోంది.
Sa re ga ma pa reality show 14th season: కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, మీడియా కోసం మ్యూజికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది మన జీ తెలుగు. ఫిబ్రవరి 18 నాడు సాయంత్రం హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జెస్ కోటి, ఎస్పి శైలజ, స్మిత, అనంత శ్రీరామ్‌తో పాటు మెంటార్స్ గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌడిన్య పాల్గొన్నారు.
Kalyanam Kamaneeyam serial launching: జీ తెలుగు అంటేనే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుండెకు హత్తుకునేలా, కళ్ల ముందు కదలాడే పాత్రలను ఆడియెన్స్ ఓన్ చేసుకునేలా సీరియల్స్ తెరకెక్కించి బుల్లితెర అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే జీ తెలుగు టీవీ ఛానెల్ (Zee Telugu TV channel).. తాజాగా కళ్యాణం కమనీయం అనే మరో సరికొత్త సీరియల్‌తో అభిమానుల ముందుకొస్తోంది. కళ్యాణం కమనీయం సీరియల్ కథా, కమామిషు, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ZEE Launches New Channel: సరికొత్త మార్పులతో జీ తెలుగు న్యూస్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ డిజిటల్ న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. జీ మీడియా ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డా. సుభాష్ చంద్ర వర్చువల్ గా ఈ నాలుగు ఛానల్స్ ను మంగళవారం ప్రారంభించారు.
Naga Chaitanya Video viral : వైరల్ అవుతోన్న అక్కినేని నాగ చైతన్య వీడియో. చైతన్య సిగ్గుపడుతూ ఇచ్చిన రియాక్షన్ వీడియోతో పాటు మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్. డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.
Anchor Pradeep and Anchor Sreemukhi's special show on Dasara 2020: ఇండియా, చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ సంతోష్ బాబుకు ఓ కార్యక్రమం ద్వారా జీ తెలుగు ఘన నివాళి అర్పించింది. దేశం కోసం వీర సైనికుడి త్యాగాన్ని ఓ సూపర్ పర్ఫార్మెన్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. గూస్బంప్స్ వచ్చే ఈ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు బుధవారం విడుదల చేసింది.
ప్రముఖ సినీ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) ఈ మధ్య జీ తెలుగు ఎంటర్టెయిన్మెంట్ లీగ్ 2020 లో పాల్గొంది. ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమోని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ షో గత ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో టెలిక్యాస్ట్ అయింది. 'ఈ షోలో నేను పాట పాడటం, డ్యాన్సు వేయడం, కడుపుబ్బా నవ్వడం చూడొచ్చు' అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Choreographer Jani Master) పేరెత్తితే ఎవరికైనా ఆయన వేసే మాస్ స్టెప్పులే గుర్తుకొస్తాయి. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గానే ఆడియెన్స్ అందరికీ సుపరిచితుడు. డ్యాన్స్ అంటే కేక పుట్టించే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr) అయినా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అయినా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) అయినా.. ఇంకొకరైనా.. జానీ మాస్టర్ స్టెప్స్ అంటే ఇష్టపడతారు.
'జీ తెలుగు' ఛానెల్ లో డ్రామా జూనియర్ ఎంత ప్రసిద్ది చెందిన ప్రోగ్రామో అందరికీ తెలుసు. కొద్ది రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ ఫ్రెష్ లుక్ తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు డ్రామా జూనియర్స్ త్వరలో స్టార్ట్ కాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.