How to Indentify Fake Apple iPhones: ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా 'యాపిల్ ఐఫోన్'కు చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్ద వయసు వారు కూడా తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మిగతా స్మార్ట్‌ఫోన్‌ల కంటే.. ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది కొనలేకపోతున్నారు. కొంతమంది దుకాణదారులు దీని ఓ అవకాశంగా తీసుకుంటున్నారు. విదేశీ మార్కెట్ల నుంచి ఐఫోన్ ప్రతిరూప నమూనాలను తీసుకొచ్చి.. ఒరిజినల్ మోడల్స్ పేరుతో మార్కెట్లో కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
భారతదేశంలో నకిలీ ఐఫోన్ మోడల్స్ తెలియని వారు అమ్మకదారుల ఉచ్చులో పడి మోసపోతున్నారు. భారీ మొత్తంలో ఖర్చు చేసినా.. కావాల్సిన మోడల్ లభించడం లేదు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఐఫోన్ మోడల్‌ని కొనుగోలు చేయబోతున్నట్లయితే.. కొన్ని ట్రిక్ (Duplicate Apple iPhone Checking) ఇస్తున్నాము. దీని వల్ల మీరు కొనుగోలు చేస్తున్న ఐఫోన్ మోడల్ నకిలీదా? కాదా? అని మీరు తెలుసుకోవచ్చు.
ఐఫోన్ రెప్లికా మోడల్‌ను గుర్తించే 5 విధానాలు (Apple iPhone Replica Check):
# ఐఫోన్ యొక్క నకిలీ మోడల్‌లో దాదాపు 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఐఫోన్ ఒరిజినల్ మోడల్ రిఫ్రెష్ రేట్ 120 Hz.
# ఐఫోన్ నకిలీ మోడల్‌ను గుర్తించడానికి సులభమైన మార్గం కెమెరాను చెక్ చేయడం. నకిలీ మోడల్‌లో ఒక లెన్స్ మాత్రమే పని చేస్తుంది (మిగిలిన లెన్స్‌లు నకిలీవి).
# ఒరిజినల్ ఐఫోన్ మోడల్‌లో డిస్‌ప్లేలో బెజెల్‌లు ఉండవు. ప్రతిరూప మోడల్‌లో గుర్తించగలిగే బెజెల్‌లు ఉంటాయి.
# గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఒరిజినల్ ఐఫోన్ యొక్క ప్రీమియం మోడల్‌లలో ఉంటుంది. అయితే కస్టమర్‌లు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌ను నకిలీ ఐఫోన్ మోడల్‌లలో చూడవచ్చు.
# అన్నింటికంటే ముఖ్యమైంది ఐఫోన్ బరువు. వాస్తవానికి ఒరిజినల్ ఐఫోన్ మోడల్ బరువు బాగానే ఉంటుంది. అయితే నకిలీ ఐఫోన్ మోడల్ బరువు చాలా తక్కువగా ఉంటుంది.
Also Read: Shubman Gill Century: శుభ్‌మన్ గిల్ అలవోకగా 8-10 వేల పరుగులు చేస్తాడు.. సునీల్ గవాస్కర్ జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
డుబ్లికేట్ ఐఫోన్ మోడల్‌ను గుర్తించడం చాలా ఈజీ.. ఒక నిమిషంలో నిజమైనదో, నకిలీదో తెలుసుకోవచ్చు!
డుబ్లికేట్ ఐఫోన్ మోడల్‌ను గుర్తించడం చాలా ఈజీ
ఒక నిమిషంలో నిజమైనదో, నకిలీదో తెలుసుకోవచ్చు
రెప్లికా మోడల్‌ను గుర్తించే 5 విధానాలు