Bajaj Platina 125 New Model 2025: ప్రముఖ బజాజ్ కంపెనీ మార్కెట్‌లోకి తమ మరో కొత్త బైక్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బైక్ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో కాదు.. ప్లాటినా 125 కొత్త సిరీస్.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వస్తోంది.
ఈ బజాజ్ ప్లాటినా 125 కొత్త మోడల్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదల కానుంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు డిజైన్‌ను కూడా మార్చినట్లు సమాచారం.. అలాగే ఈ మోటర్‌సైకిల్ శక్తివంతమైన ఇంజన్‌తో లాంచ్ కాబోతోంది. అలాగే ఈ కొత్త మోడల్ బజాజ్ ప్లాటినా అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ 124.68cc ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇది లీటర్‌కి దాదాపు 75 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బజాజ్ ప్లాటినా 125 మోటర్‌సైకిల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే సింగిల్-ఛానల్ ABS సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇందులో కంపెనీ స్పీడోమీటర్, ఓడోమీటర్స్‌ను కూడా అందిస్తోంది.ఈ మోటర్‌సైకిల్‌లో ట్రిప్ మీటర్‌తో పాటు ప్రత్యేకమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో ట్యూబ్ లెస్ టైర్లను కూడా అందిస్తంది. ఇందులో మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
విడుదలకు ముందు ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం..ఈ మోటర్ సైకిల్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దీనిని వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకు రానున్నాయి. అంతేకాకుండా ఈ బైక్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే వివిధ అత్యధిక మైలేజీనిచ్చే మోటర్‌సైకిల్స్‌తో పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి