Google AI: అయితే ఇప్పుడు త్వరలో రోబో లాంటి దృశ్యమే సాక్షాత్కరించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త అణ్వేషణల్ని శోధిస్తోంది గూగుల్. కంటితోనే స్కానింగ్ చేసే పద్ధతిని అణ్వేషిస్తోంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మనిషి ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధుల్ని లేదా సమస్యల్ని గుర్తించేందుకు తరచూ ఎక్స్ రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి పరీక్షలు తప్పనిసరిగా మారాయి. వీటి వల్ల సమయాభావంతో పాటు ఖర్చు కూడా ఎక్కువ. సంబంధిత ఆసుపత్రుల్నించి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కోసం మరో చోటికి రోగిని తీసుకెళ్లడం, తిరిగి ఆసుపత్రికి తీసుకురావడం పెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే గూగుల్ ఏ1 కళ్లను స్కాన్ చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది గూగుల్. ఇది సక్సెస్ అయితే వ్యాధులను వేగంగానే కాకుండా యాక్యురెసీతో తెలుసుకోవచ్చు. అందుకే గూగుల్ ఇప్పుడు కంటి నుంచి వచ్చే వ్యాధుల్ని గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోంది.
కళ్లను స్కాన్ చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల్ని గుర్తించే ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్తులో ఎక్స్ రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటివి అవసరముండదు. అంటే ఈ పరిశ్రమకు ముప్పు ఏర్పడనుంది. గూగుల్ ఈ ప్రాజెక్టుపై పనిచేసేందుకు ఇండియాలోని అరవింద్ ఐ హాస్పిటల్‌తో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం ఏ1 సహాయంతో డయాబెటిక్ రెటినోపతిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. డయాబెటిక్ రెటినోపతి అంటే మధుమేహం కారణంగా కంటి నరాలు దెబ్బతిని కంటి చూపు తగ్గిపోవడం.
ముందుగా అంధత్వ సంకేతాలను గుర్తించగలిగే ఆల్గారిథమ్ అభివృద్ధి చేశారు. సంబంధిత రోగి రెటీనా ఫోటోతో ఇది పనిచేస్తుంది. ఇంతకుముందు సెక్స్, ధూమపానం ఆధారంగా ఐదేళ్ల గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేసేందుకు గూగుల్ ఆల్గారిథమ్ ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ఆటోమేటెడ్ రెటినాల్ డిసీజ్ అసెస్మెంట్ అంటే ఏఆర్‌డీఏ పరికరంగా మార్చాలని గూగుల్ భావిస్తోంది. ఇదెలా పనిచేస్తుందంటే...
దాదాపు 50 మంది కంటి వైద్య నిపుణులు 10 లక్షల రెటీనా స్కాన్లు పరిశీలించారు. ప్రతి స్కాన్‌ను ఒకటికి పదిసార్లు సమీక్షించాక అప్‌గ్రేడ్ చేశారు. ఇలా అప్‌గ్రేడ్ చేసిన రెటీనా ఫోటోలు ఇమేజ్ రికగ్నిషన్ ఆల్గారిథమ్‌లో మార్చారు. వీటి సహాయంతో డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు ఎలా ఉన్నాయో కంటి వైద్యులు తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు. రెటీనా స్కాన్లను ఏఆర్డీఏకు అప్లోడ్ చేయడం ద్వారా డయాబెటిక్ రెటినోపతిని విశ్లేషించగలిగింది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసిన తరవాత రెటీనా స్కాన్‌ను బట్టి కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని సైతం గుర్తించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. కానీ ఒకసారి సక్సెస్ అయితే మాత్రం ఇక ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్ రేలకు చెల్లుచీటీ చెప్పినట్టే.
Also read: Toyoto Innova Craze: మార్కెట్లో ఆ కారు క్రేజ్ ఎలాగుందంటే వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook