HMD Aura² Price And Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ HMD గ్లోబల్ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ప్రీమియం లుక్‌లో విడుదల కానుంది. దీనిని కంపెనీ HMD Aura² పేరుతో విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో లాంచ్ చేసిన వేరియంట్‌కంటే చాలా అప్డేట్ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ HMD Aura² స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.52-అంగుళాల HD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎక్కువ సేపు స్క్రోలింగ్ చేసేందుకు చాలా బాగా పని చేస్తుంది. అలాగే 576 x 1280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 460 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో విడుదల కానుంది.. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఇక భారత మార్కెట్‌లో దీని ధర రూ. 9,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మార్చి 13వ తేదిన మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఇది ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో కూడా లభించనుంది.
HMD Aura² స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 13MP ప్రధాన కెమెరాతో విడుదల కానుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే వివిధ రకాల సెన్సార్స్ కూడా లభిస్తున్నాయి.దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన UNISOC SC9863A ప్రాసెసర్‌తో విడుదల చేసింది. అలాగే దీనిని మొదట 4GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అయ్యింది. ఇది స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది.
ఈ HMD Aura² స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భతమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. అయితే దీని డిస్ల్పే చెడిపోతే స్వయంగా రిపేర్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఫీచర్‌ను తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇతర పార్ట్స్ చెడిపోతే కూడా మార్చుకునేందుకు ప్రత్యేకమైన iFixit భాగస్వామ్యం అందిస్తోంది. దీని వల్ల ఎలాంటి రిపేరింగ్ అయిన సులభంగా చేసుకోవచ్చు.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి