Moto G84 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటో బ్రాండ్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం కెమెరాతో కూడిన మొబైల్స్‌ను కూడా అతి తక్కువ ధరలోనే విక్రయిస్తూ వస్తోంది. గతంలో లాంచ్ అయిన మొబైల్స్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో త్వరలోనే వాటికి సక్సెసర్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది కూడా గతంలో లాంచ్ చేసిన మొబైల్ లాగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే లభించబోతోంది. అయితే ఇంతకి త్వరలో విడుదలయ్యే మొబైల్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే కొంతమంది టిప్‌స్టర్స్ అందించిన వివరాల ప్రకారం, మోటో కంపెనీ Moto G84 5G పేరుతో కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ధర వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు బ్యాక్ సెటప్‌లో అద్భుతమైన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలాగే కంపెనీ ఈ మొబైల్‌ను విభిన్నమైన డిజైన్‌తో పరిచయం చేయబోతున్నట్లు టిప్‌స్టర్స్ వెల్లడించారు. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫ్రంట్ లుక్ వివరాల్లోకి వెళితే, దీని ముందు భాగంలో ఫ్రంట్ కెమెరా కోసం డిస్‌ప్లే పైభాగంలో పంచ్ హోల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం జెజెల్స్‌లో రాబోతోంది. అంతేకాకుండా మరెన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక లీక్ అయిన వివరాల ప్రకారం ఈ Moto G84 స్మార్ట్ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, దీని ధర దాదాపు రూ.27,000 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ చూస్తే, ఇది Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 4 Gen 3తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత UIపై పని చేసే అవకాశాలు ఉన్నట్లు టిప్‌స్టర్స్ వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ త్వరలోనే వెల్లడించే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి