Poco M6 Pro 5G Price: పోకో స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. కంపెనీ గత నెలలో విడుదల చేసిన Poco M6 Pro 5G స్మార్ట్ ఫోన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మొదట ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందబాటులోకి వచ్చింది. అయితే కంపెనీ ఈ మొబైల్‌ను 4 GB + 64 GB, 6 GB + 128 GB వేరియంట్స్‌లో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌పై రేపటి నుంచి సెప్టెంబర్ 14 నుంచి ప్రత్యేక సేల్ ప్రారంభించబోతోంది. అయితే ఈ సేల్ భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభించనుంది. ఈ Poco M6 Pro 5Gకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట పోకో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను రూ.16,999లకు విక్రయించింది. అయితే ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 23 శాతం తగ్గింపుతో రూ.12,999లకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తాయి. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ICICI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 750 తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మీరు అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 12,050 వరకు తగ్గింపు పొందవచ్చు..దీంతో మీరు రూ.949 లకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
POCO M6 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ 2460x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.79 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా HD + డిస్ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే గరిష్టంగా 550 నిట్ స్థాయి బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డిస్ప్లే రక్షణ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే..Adreno 613 GPUతో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2ని కలిగి ఉంటుంది.
ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు:
✾ 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
✾ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
✾ సెల్ఫీకోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✾ 5000mAh బ్యాటరీ
✾ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
✾ Android 13 ఆధారిత MIUI 14
✾ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
✾ 5G డ్యూయల్ సిమ్
✾ బ్లూటూత్ 5.1
✾ 3.5mm హెడ్‌ఫోన్ జాక్
✾ GPS కనెక్టివిటీ
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook