Redmi 13C 5G Price Drop: గతంలో రెడ్‌మీ స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉండేది ప్రీమియం ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ను విడుదల చేయడంతో యువత ఎక్కువగా రెడ్మీ మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే దీనిని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తూ కంపెనీ కొత్త కొత్త మోడల్స్ ను విడుదల చేస్తూ వస్తున్నాయి. అయితే గతంలో విడుదల చేసిన రెడ్మి 13 మోడల్ కు అప్డేట్ వేరియంట్ గా Redmi 13C 5G అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన కెమెరా సెట్ అప్ తో పాటు ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో.. వాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో ఈ Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 4GB ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరీస్ తో లభిస్తుంది. ఇక రెండవ వేరియంట్ 6 జిబి ర్యామ్, మూడవ వేరియెంట్ 8 జిబి ర్యామ్ లలో అందుబాటులో ఉంది. ఇక అమెజాన్ మొదటి వేరియంట్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ను అందిస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి 36 శాతంకు పైగా తగ్గింపు లభిస్తుంది. ఇక ఆఫర్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ అసలు ధర రూ.13,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 36% తగ్గింపుతో కేవలం రూ 8,999కే పొందవచ్చు.
ఇక ఈ Redmi 13C 5G మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.8,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే అత్యధిక ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అమెజాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో భాగంగా కండిషన్ బాగా లేకుంటే ఎక్స్చేంజ్ బోనస్ లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మొబైల్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 499కే కొత్త మొబైల్ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అనేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
MediaTek Dimensity 700 ప్రాసెసర్
50MP ప్రైమరీ రియర్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్
5000mAh బ్యాటరీ
5G కనెక్టివిటీ
90Hz రిఫ్రెష్ రేట్
వైడ్‌విన్ L1 సర్టిఫికేషన్
HD, Full HD కంటెంట్
డ్యుయల్ సిమ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.