Redmi Pad Pro 5G: 10000mAh బ్యాటరీతో Redmi Pad Pro వస్తోంది.. ఫీచర్స్‌ చూస్తే ఫిదా అవుతారు!

Redmi Pad Pro 5G: భారత మార్కెట్‌లోకి 10000mAh బ్యాటరీతో అతి శక్తివంతమైన Redmi Pad Pro 5G లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 6, 2024, 01:02 PM IST
Redmi Pad Pro 5G: 10000mAh బ్యాటరీతో Redmi Pad Pro వస్తోంది.. ఫీచర్స్‌ చూస్తే ఫిదా అవుతారు!

 

Redmi Pad Pro 5G: త్వరలోనే ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Xiaomi గుడ్‌న్యూస్‌ తెలపబోతోంది. కంపెనీ రెడ్‌మీ ప్యాడ్ ప్రో 5Gను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా విడుదలకు ముందే ఈ ట్యాబ్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీనిని కంపెనీ గతంలో కంపెనీ చైనాలో విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ ట్యాబ్‌ను పోకో బ్రాండింగ్ పేరుతో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ స్మార్ట్‌ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

Redmi Pad Pro 5G  ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Redmi Pad Pro 5G అద్భుతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీని డిస్ప్లే వివరాల్లోకి వెళితే, ఇది 12.1-అంగుళాల 2.5K LCD ప్యానెల్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే 2560x1600 పిక్సెల్ రిజల్యూషన్‌ సెటప్‌తో వస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ సెటప్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది  180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 600 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్యాబ్‌  డిస్‌ప్లే ప్రొటక్షన్‌ కోసం ప్రత్యేమైన  గొరిల్లా గ్లాస్‌తో రాబోతోంది. 

ఈ ట్యాబ్‌ 8 GB LPDDR4x ర్యామ్‌తో పాటు 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో 1.5 TB మెమరీని కూడా పెంచుకోవచ్చు. దీంతో పాటు ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది  Adreno 710 GPUపై పని చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ ట్యాబ్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, దీని వెనకాలో 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అంతేకాకుండా  8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా కూడా ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్యాడ్‌ ఎంతో శక్తివంతమైన 10000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
బయోమెట్రిక్ సపోర్ట్‌
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
Android 14లోని HyperOS
Wi-Fi 6, 
బ్లూటూత్ 5.2
USB టైప్-C 2.0

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News