Big Shock For BRS: హస్తం గూటికి వలసల పర్వం మొదలైంది. నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈనేపథ్యంలో బోరబండ కార్పొరేటర్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు వలసలు మొదలయ్యాయి. నిన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు తమ కుమారుడు రినీశ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొద్దిసేపు ముఖ్యమంత్రితో వారిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. కొన్ని నిమిషాలపాటు రహాస్యంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Medaram Jatara: హైదరాబాద్- మేడారం వయా వరంగల్.. జాతరకు బస్ టిక్కెట్ ధరలు.. సమయం..
గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వీరితోపాటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని మంత్రి అనుచరులు మీడియాకు వెల్లడించారు.
ఇదీ చదవండి: Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ పార్టీలోకి 'పట్నం' దంపతులు?
తాండూరు నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించగా అది దక్కక మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మహేందర్ రెడ్డి పక్క దారి చూస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీఆర్‌ఓస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా విధేయుడుగా ఉన్న డిప్యూటీ మాజీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ కూడా నేడు హస్తం గూటికి చేరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరికొంత మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బాబా ఫసియుద్దీన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ దీపా దాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమసమయంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు ఫసియుద్దీన్. ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ గా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో మొదటి డిప్యూటీ మేయర్ గా కూడా పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook