Danam Nagender UTurn: జలాశయాల సంరక్షణ.. ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ పేరిట ఏర్పాటైన హైడ్రాపై కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తీరును తప్పుబట్టారు. అంతేకాకుండా ఫార్ములా ఈ కారు రేసు అంశంలో కేటీఆర్ తప్పు లేదని తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు.
Also Read: Ration Cards: సంక్రాంతి తర్వాత తెలంగాణ ప్రజలకు పండుగ.. ఖాతాల్లోకి రూ.12 వేలు, రేషన్ కార్డులు
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కారు కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదని దానం నాగేందర్ వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియా ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలను కప్పి పుచ్చుకున్నారు. ఫార్ములా ఈ కారు రేసు వలన హైదరాబాద్ కీర్తి పెరిగిందని మాత్రమే చెప్పానని.. కేసు విచారణ జరిగేటప్పుడు ఆ కేసుపై మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. ఇందులో క్విడ్ ప్రొకో జరిగిందా లేదా అనేది తేలాలని చెప్పారు.
Also Read: Revanth Reddy: అమరావతిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'
ఇక హైడ్రా తవ్వకాలపై స్పందించిన దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'హైడ్రా వలన ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందని మళ్లీ చెబుతున్నా ' అని పునరుద్ఘాటించారు. హైడ్రాపై రేవంత్ రెడ్డి పునరాలోచించాలని దానం విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయించినందుకు ఉప ఎన్నిక వస్తే భయపడనని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ ఖాళీగా ఉందని.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు. రైతు భరోసా, రుణమాఫీకి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.