Telangana BJP: తెలంగాణలో బీజేపీ లెక్కలు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం..!

Telangana MLC Elections: ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది..! దాదాపు 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో.. కమలనాథులంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు..! ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు..! వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా..!   

Written by - G Shekhar | Last Updated : Feb 12, 2025, 12:15 PM IST
Telangana BJP: తెలంగాణలో బీజేపీ లెక్కలు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం..!

Telangana MLC Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి కాషాయ పార్టీ మట్టికరిపించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని కాషాయ జెండా ఎగరడంతో నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.. గత రెండు పర్యాయాలు ఢిల్లీలో అధికారం కోసం కమలం పార్టీ ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ స్ట్రాటజీ సక్సెస్‌ అయ్యింది. ఢిల్లీలో ఎలాగైనా జెండా పాతాలనే కమలం పార్టీ నేతల కల సాకారమైంది. ఇప్పుడు కాషాయ పార్టీలో సరికొత్త చర్చ జరుగుతోందట. వాట్‌ నెక్స్ట్‌ అని కమల నాథులు లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు కమలం పార్టీ పెద్దల కన్ను తెలంగాణపై పడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర పెద్దలు దిశానిర్ధేశం కూడా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 
 
తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల జోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్‌లో సమావేశమైన లీడర్లు.. ఈసారి మూడు సీట్లలో విజయం సాధించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం సరైనా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోగలితే.. వచ్చే ఎన్నికల్లో అధికారానికి మరింత దగ్గర కావొచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతం దేశమంతా తమ పార్టీని విస్తరించిన కమలం పార్టీ.. కేవలం దక్షిణాదిలో అధికారంలో లేదు.. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికారంలోని రావాలని లెక్కలు వేసుకుంటోంది. ఇందుకోసం మొదట తెలంగాణనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో అధికారం నిలబెట్టుకున్న కమలం పార్టీ.. రానున్న రోజుల్లో తెలంగాణతోపాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ జెండా పాతేస్తామని కేంద్ర హోంవాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. 
 
తెలంగాణలో ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉంది. ఆ లోపు పార్టీని మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కమలం పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అటు మండలిలోనూ బీజేపీకి బలం పెరుగుతుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా మండలిని దక్కించుకోవాలని పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారట. ప్రస్తుతం ఢిల్లీలో గెలిచిన ఊపులో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు ఊవ్విళ్లూరుతున్నారట. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతుందని.. ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తే.. అధికారానికి దగ్గరవుతామని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం. రాష్ట్రంలో ఏడాదిలోపే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని.. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని.. తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 
మొత్తంగా ఢిల్లీలో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తే అధికారం మరింత సులువు అవుతుందని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో పదువైన వ్యూహాలతో ముందుకు పోవాలని రాష్ట్ర నేతలకు కేంద్ర పెద్దలు సూచించనట్టు సమాచారం. చూడాలి మరి కమలం పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తూ.. రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా ముందుకు సాగుతారో..!

 Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

Also Read:  Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News