Dasoju Sravan Kumar Got Threatening Calls: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనను రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని ఆయన చెబుతున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిన్న సాయంత్రం శ్రవణ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే రాత్రి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది.
రాత్రి 12 గంటల సమయంలో కొంత మంది వరుసగా కాల్స్ చేసి తనను బెదిరించారని శ్రవణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో బెదిరించారని చెప్పారు. బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి ఉండడం దురదృష్టకరమన్నారు. గతంలో సొంత పార్టీ నేతలనే రేవంత్ రెడ్డి తన టీమ్ ద్వారా బెదిరించారని గుర్తు చేశారు. రౌడీ రాజకీయాలు మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
"గత రాత్రి రేవంత్ రెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ కొంతమంది వ్యక్తులు నా మొబైల్‌కి 12.15 AM నుంచి పదే పదే కాల్స్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో బెదిరించారు. నేను సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్, సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తాను.
తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదృష్టకరం. గతంలో కూడా తన అనుచరుల ద్వారా వి.హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ఆయన ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా నన్ను అడ్డుకోలేవని రేవంత్ తెలుసుకోవాలి. కాంగ్రెస్ లాంటి 125 ఏళ్ళ పార్టీలో ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్‌ని ఎలా ప్రోత్సహిస్తున్నారు..? సహిస్తున్నారు..?" అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Also Read: Twitter Ads Revenue: ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. మాట నిలబెట్టుకున్న ఎలన్ మస్క్
Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook