KCR Social Media Entry: మారుతున్న కాలానికి తగ్గట్టు నాయకులు కూడా మారాలి అంటారు. ప్రజల అభిరుచులకు వారు కూడా మారితే ప్రజల్లో విశేష గుర్తింపు లభిస్తుంది. కొత్త అంశాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందుండే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. ప్రజల జీవనవిధానంలో భాగమైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కేసీఆర్ అడుగుపెట్టారు.
Also Read: BRS Party: 24 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరి
తన వాగ్ధాటి, రాజకీయ చతురతతో ప్రజలనే కాకుండా ప్రముఖులను కూడా ఆకట్టుకునే స్వభావం కలిగిన కేసీఆర్‌ను కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తుంటారు. అయితే ఆయన రాజకీయాలు, ప్రభుత్వపరంగా బిజీగా ఉండే ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇన్నాళ్లు లేరు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫేసుబుక్‌లో ఉన్న కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు తెరిచారు. ఈ అకౌంట్ల ద్వారా కేసీఆర్ ఎప్పటికప్పుడు తన భావనలు, అభిప్రాయాలు, విశేషాలు పంచుకోనున్నారు. ఖాతాలను ప్రారంభించిన గంటల్లోనే భారీగా ఫాలోవర్లు పెరిగారు. గంట వ్యవధిలోనే పది వేల మార్క్ చేరుకుంది. కాగా కేసీఆర్‌ను పలువురు వివిధ రంగాల ప్రముఖులు కూడా ఫాలోవుతున్నారు.
Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే మిర్యాగూడ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో పర్యటించారు. ఇదే క్రమంలో పొలంబాట కార్యక్రమం కూడా నిర్వహిస్తూ కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. తెలంగాణకు రక్ష తానేనని.. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN
— KCR (@KCRBRSPresident) April 27, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter