CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నా తర్వాత నెక్ట్స్ సీఎం ఆయనే అంటూ క్లారిటీ.. వీడియో వైరల్..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తన తర్వాత సీఎం అయ్యే అన్నిరకాల అర్హతుల వారికే ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2024, 10:40 AM IST
  • నల్గొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్..
  • కాంగ్రెస్ నేతలకు ఊహించని ట్విస్ట్..
CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నా తర్వాత నెక్ట్స్ సీఎం ఆయనే అంటూ క్లారిటీ.. వీడియో వైరల్..

CM Revanth Reddy Interesting Comments On Komatireddy Brothers: తెలంగాణ రాజకీయాలు జెడ్ స్పీడ్ లో మారిపోతున్నాయి. ఒక వైపు ఎండలు, మరోవైపు లోకసభ ఎన్నికలు ప్రచారంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి..నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నిలక ప్రచారంలో పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తేనే, కేంద్రంలో ఐఎన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ అసలైన తెలంగాణ పోరాట యోధులన్నారు. వీరిద్దరు తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పదవులను త్యాగం చేశారని గుర్తు చేశారు.

నల్గొండ బ్రదర్స్ లు పొరాట స్పూర్తికి నిదర్శనమన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్.. అనేక సందర్బాలలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఒప్పించి, మెప్పించి నల్గొండను ఈరోజు ఎంతో డెవలప్ చేశారని అన్నారు. నా తర్వాత సీఎంగా ఉండటానికి ఎవరికైన అర్హత ఉందా .. అంటే అది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కే అని స్పష్టం చేశాడు. సీఎం కేసీఆర్ పదేళ్లపాటు, బీజేపీతో రహాస్యంగా కుమ్మక్కైయ్యాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే.. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉంటుందన్నారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే 50 వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేసి బాధ్యత నాదని సీఎం రేవంత్ అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే కాంగ్రెస్ లో మల్లు భట్టీవిక్రమార్క,పొంగులేటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్ తదితరులు ఇప్పటికే సీఎం రేసులో ఉన్నామని పలుసమావేశంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ తన తర్వాత, కోమటి రెడ్డి నెక్ట్స్ ప్లేస్ లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి.

Read More: CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..

కొందరు సీనియర్లు దీనిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు కేవలం నల్గొండలో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసమే, ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అంటున్నారు. ఏది ఏమైన ప్రస్తుతం ఎన్నికల సమయంలో సీఎం స్థాయి వ్యక్తి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని అంటున్నారు. దీని వల్ల అంతర్గత కుమ్ములాటలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News