Telangana Health Minister Etela Rajender | హైదరాబాద్: ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine) పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు. తెలంగాణలో ఎక్కడా ‘బర్డ్ ఫ్లూ’ (bird flu) సంబంధించిన ఆనవాళ్లు లేవని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల (Etela Rajender) పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దంటూ ఆయన సూచించారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) లో ఆధునీకరించిన అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200కోట్లు, వైద్యరంగం కింద రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు సైతం నిధులు కేటాయిస్తున్నామన్నారు. నిమ్స్‌లో సకల సౌకర్యాల కోసం రూ.450కోట్లను కేటాయించినట్లు తెలిపారు. Also Read: Covid-19 Vaccine: 11న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
నిమ్స్ లో మెడికల్ ఆంకాలజీలో పునర్నిర్మాణం చేసిన భవనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ @Eatala_Rajender, మెగా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ పి.పి రెడ్డి, డైరెక్టర్ సుధా రెడ్డి. pic.twitter.com/iymRST1gMH
— EATALA Office (@EATALAOffice) January 9, 2021
రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సిన్ డ్రైరన్ విజయవంతమయిందని.. కేంద్రం వ్యాక్సిన్ (Covid-19 Vaccine) ను ఎప్పుడూ పంపినా వాక్సినేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి వాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి రాజేందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఎంఐఈఎల్ అధ్యక్షుడు పీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Also Read: Quid pro quo case: ఏపీ సీఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook