KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలు

KCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 07:59 PM IST
KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలు

KCR Farmhouse: నిత్యం వెన్నంటి ఉంటూ.. తన కష్టకాలంలో.. ఆనంద సమయాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు భావోద్వేగ వీడ్కోలు పలికారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ ఇన్‌చార్జ్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు సేవలు అందించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అమెరికాకు వెళ్లిపోతున్నారు. కుటుంబంతో అక్కడే స్థిర నివసించేందుకు వెళ్తుండడంతో కేసీఆర్‌ అతడికి ఆత్మీయంగా బంగారు గొలుసు.. పట్టువస్త్రాలు సమర్పించి సాగనంపారు.

ఇది చదవండి: IPS Officers: 'కలెక్టర్‌ను పట్టుకుని కాంగ్రెస్‌ కార్యకర్త అంటారా?' కేటీఆర్‌పై ఐపీఎస్‌ అధికారుల ఆగ్రహం

 

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కుటుంబంతో సహా కలిశారు. తన సతీమణి శోభతో కలిసి శ్రీనివాస రెడ్డి కుటుంబంతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆత్మీయంగా తన నివాసంలోకి స్వాగతం పలికి ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ బంగారు గొలుసును శ్రీనివాస్‌ రెడ్డికి కానుకగా అందించారు. అనంతరం పట్టువస్త్రాలు అందించి.. వారి పిల్లలకు కానుకలు బహూకరించారు. సంప్రదాయబద్దంగా శ్రీనివాస్‌ రెడ్డికి వీడ్కోలు పలికారు. అనంతరం దగ్గరుండి కారు వద్దకు వెళ్లి మరి కేసీఆర్‌ దంపతులు వీడ్కోలు పలికారు.

ఇది చదవండి: Harish Rao: రేవంత్ రెడ్డి 'ఆ పని' చేస్తే పూలబోకే ఇచ్చి థాంక్స్ చెప్తా: హరీశ్ రావు

ఈ సందర్భంగా తెలంగాణ వాది, ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌తో తన అనుబంధాన్ని వివరించారు. 'నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారం' అని తెలిపారు. తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి.. తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్‌ వద్ద 25 ఏళ్ల పాటు పనిచేయడం తన అదృష్టమని.. తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పారు.

'కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాకపోయేది. తెలంగాణ కోసమే కేసీఆర్ జీవితం అర్పితం చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం. ప్రేమతో మీ కేసీఆర్.. (విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్) అని నాకు వేసిన లాకెట్. నాలాంటి తెలంగాణ వాదులందరికీ వేసిందిగా భావిస్తున్నా' అని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన తనకు అమెరికా వెళ్లిపోవడం తప్పనిసరిగా మారిందని పేర్కొన్నారు.

'తెలంగాణ గడ్డను వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ తప్పని పరిస్థితి. తెలంగాణ వాదులందరి తరఫున కేసీఆర్‌కు ధన్యవాదాలు. అడ్డు తెరలు లేని ఆత్మీయతకు చిరునామాగా కేసీఆర్‌ నిలిచారు. హోదాతో సంబంధం లేని.. ఆత్మగల మనుషుల అనురాగ బంధం కేసీఆర్. తెలంగాణ మట్టి ఆత్మీయతకు నిలువుటద్దం కేసీఆర్. తెలంగాణ వాదికి ఘన సత్కారంతో మరోసారి రుజువైంది' అని శ్రీనివాస్‌ రెడ్డి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News