Father kills 11 months old daughter with electric shock in Siddipet District : ఒక తండ్రి 11 నెలల కూతుర్ని దారుణంగా చంపేశాడు. ఆ చిన్నారికి విద్యుత్ షాక్ పెట్టి..చిత్ర హింసలకు గురి చేశాడు ఆ దుర్మార్గుడు. సిద్ధిపేట జిల్లాలో (Siddipet District) ఈ దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం (Thoguta Mandal) వెంకట్రావుపేటలో (Venkatrao Peta) ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
భార్యతో గొడవపడి అభం శుభం తెలియని చిన్నారిని హత మార్చాడు ఆ భర్త. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్‌కు దౌల్తాబాద్‌కు చెందిన సునీతతో పెళ్లి అయ్యింది. వీరి కాపురం కొంత కాలం బాగానే సాగింది. అయితే వీరికి పాప పుట్టిన తర్వాత గొడవలు మొదలయ్యాయి.నిత్యం సునీత.. రాజశేఖర్ (Rajasekhar) గొడవపడేవారు. విబేధాలు తలెత్తినప్పుడల్లా ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు వారు కలిసి కాపురం చేసుకునేలా సర్ది చెప్పేవారు.
అయితే సునీతకు (Sunita) అత్తమామలకు మధ్య గొడవలకు దారి తీసే అవకాశాలు ఉంటే వేరు కాపురం పెట్టడంటూ పెద్దలు వారికి సూచించారు. దీంతో వేరు కాపురం పెడదామంటూ సునీత పట్టుబట్టింది. అయితే రాజశేఖర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ గొడవలు పెద్దవయ్యాయి.
Also Read : Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..
ఇక ఇవాళ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజశేఖర్ తన భార్య సునీతను కొట్టాడు. తర్వాత 11 నెలల తమ పాపను (11 months old daughter) తీసుకుని పొలం దగ్గరున్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడే ఆ పాపకు విద్యుత్ షాక్ (Electric shock) ఇచ్చి చంపేశాడు.పాప చనిపోయాక రాజశేఖర్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే సమాచారం తెలుసుకున్న రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు (Hospital) తీసుకెళ్లి చికిత్స అందించారు.
Also Read : Smriti Irani : ఏపీలో కేంద్ర పథకాలకు సీఎం జగన్ పేర్లు పెట్టడంపై స్మృతి ఇరానీ సీరియస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి