Hyderabad Realtor Suicide: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం దిగ్భ్రాంతికి లోనయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎదురైన విపత్కర పరిస్థితుల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అతడి బలవన్మరణాన్ని రేవంత్ రెడ్డి చేసిన హత్యగా బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. హైడ్రా వంటి వాటితో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శిస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేారు.
Also Read: Union Budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. దక్కిన నిధులు ఎన్ని అంటే?
కొంపల్లిలో మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం మీడియాతో మాట్లాడారు. 'కొంపల్లి రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య తీవ్రంగా కలిచివేసింది. 'వేణుగోపాల్ రెడ్డిది నిజానికి ఆత్మహత్య కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య' అని ఆరోపించారు. వేణు గోపాల్ రెడ్డి భార్య మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువ బిల్దర్ 39ఏళ్లకే చనిపోవడం.. అది కూడా ప్రభుత్వం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న అని చెప్పి మరీ ప్రాణాలు తీసుకున్నాడని హరీశ్ రావు వివరించారు.
'రేవంత్ రెడ్డిఆ పాలనలో చేనేత కార్మికులు, రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగిపోగా తాజాగా రియల్టర్లు కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అయినా రేవంత్ రెడ్డికి సోయి రావట్లేదని విమర్శించారు. హైడ్రా లాంటివి పెట్టీ ప్రజల్లో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.
'పక్క రాష్ట్రాల్లో వారు కానీ.. వేరే దేశం నుంచి హైదారాబాద్‌లో పెట్టుబడులు పెట్టేవారు కూడా భయంతో వెనక్కి వెళ్లిపోతున్నారు. అనుమతి ఉన్న వాటిని కూడా హైడ్రా పేరుతో కూలగొట్టి కక్షపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రియల్టర్ ఆత్మహత్యతోనైనా మేల్కొని ఈ ద్వేష రాజకీయాలు మానుకోవాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. 'కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పక్క దేశాలను ఆకర్షిస్తే రేవంత్ రెడ్డి వచ్చాక ఏడాదిలోపే వచ్చిన అవకాశాలను వారి పిచ్చి పనులతో వెనక్కి పంపేశారు. బిల్డర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వేణు గోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.