Heavy Rains Telugu States: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విరామం లేకుండా తన ప్రతాపం చూపిస్తున్నాడు. గ్యాప్ లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఈరోజు , రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇది రెండు రోజుల పాటు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు కూడా అత్యవసర పనులు ఉంటేకానీ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాదు వర్షాల కారణంగా కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో జిల్లాల వారీగా కంట్రోల్ ఏర్పాటు చేసారు. అటు ఏపీలోని లంక గ్రామాలు బిక్కు బిక్క మంటూ బతుకుతున్నారు. అక్కడ వుండే ప్రజలను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇంకోవైపు తెలంగాణలోని కుమురంభీమ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల భాగంగా పలు జిల్లా కేంద్రాల్లో సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా సోమవారం తెలంగాణలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.