Telangana News: కుటుంబ కలహాల నేపథ్యంలో....మద్యం మత్తులో భార్యను కత్తెర(Husband stabbing wife )తో పొడిచాడు భర్త. ఈ ఘటన తెలంగాణ హుజూరాబాద్(Huzurabad) పట్టణ శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఆమెకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రిలో చేర్పించారు.
పోలీసుల కథనం ప్రకారం...జమ్మికుంట రోడ్డులో నివాసముంటున్న కల్లూరి రమేశ్, ప్రియదర్శినిలకు 8ఏళ్ల కిందట వివాహం(Marriage) జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి రీత్యా రమేశ్ కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రమేశ్‌కు గతంలో వివాహం కాగా మొదటి భార్యకు ముగ్గురు పిల్లలుండగా, మొదటి భార్యతో నిత్యం గొడవలు(Conflicts) జరిగేవి. అదే కారణంతో ఆమె పోలీసుల(Police)కు ఫిర్యాదు చేయగా ఆర్టీసీ అధికారులు రమేశ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
Also Read: Suicide: భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య.. చావక తప్పట్లేదంటూ సెల్ఫీ వీడియో
ఈ నేపథ్యంలో రమేశ్ మంగళవారం రాత్రి గొడవ పడి ఇంట్లో ఉన్న కత్తెరతో భార్య ప్రియదర్శినిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వి.శ్రీనివాస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ప్రియదర్శిని కుమారుడు చిన్నారి సాయి చందన్ పోలీసులకు తమ తల్లిదండ్రుల మధ్య జరిగిన విషయాన్ని వివరించాడు. అనంతరం భర్త రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook