Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి Kanhaiya Kumar, Hardik Patel !

Huzurabad bypoll campaign: హుజూరాబాద్ ఉప ఎన్నికకు తేదీ సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఎన్నికల ప్రచారం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపును సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు అందుకు తగినట్టుగా తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించడమే కాకుండా వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి చరిష్మా కలిగిన నేతలను రప్పిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 07:43 PM IST
Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి Kanhaiya Kumar, Hardik Patel !

Huzurabad bypoll campaign: హుజూరాబాద్ ఉప ఎన్నికకు తేదీ సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఎన్నికల ప్రచారం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపును సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు అందుకు తగినట్టుగా తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించడమే కాకుండా వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి చరిష్మా కలిగిన నేతలను రప్పిస్తున్నాయి. అందులో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపగా.. జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ పార్టీలు (TRS vs BJP vs Congress) జాతీయ స్థాయిలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వారిని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి రప్పించాలని చూస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ తరపున హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI Telangana chief Balmoori Venkat) బల్మూరి వెంకట్ బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 30న హూజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23 నుంచి 26 మధ్యలో హుజూరాబాద్ పరిధిలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. 

Also read : Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో జరగనున్న ఈ బహిరంగ సభకు గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన కన్హయ్య కుమార్‌తో పాటు జిగ్నేష్ మెవాని (Kanhaiya Kumar, Hardik Patel, Jignesh Mevani) వంటి యువ నేతలను ఆహ్వానించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఈ ప్రతిపాదనను ఏఐసిసి మేధావుల వర్గం పరిశీలిస్తోందని, త్వరలోనే ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని సమాచారం. 

ఒకవేళ హుజూరాబాద్‌లో (Huzurabad bypolls latest news updates) కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రోడ్ షోకు, బహిరంగ సభకు అనుమతి లభించనట్టయితే.. హుజూరాబాద్ నియోజకవర్గం సరిహద్దుల వెలుపల మరో సభ నిర్వహించుకునేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బి సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది.

Also read : Bharat biotech: మలేరియాకు భారత్‌ బయోటెక్‌ టీకా..జీఎస్‌కే భాగస్వామ్యంతో ఉత్పత్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News