Hyderabad Drugs: విదేశీయుడి పొట్టలో డ్రగ్స్‌.. శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌!

Hyderabad Drugs, Cocaine seized at Shamshabad Airport. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీయుడి పొట్ట నుంచి రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 07:23 PM IST
  • శంషాబాద్ విమానాశ్రయంలో కొకైన్‌ క్యాప్సుల్స్‌
  • విదేశీయుడి పొట్టలో డ్రగ్స్‌
  • రూ. 12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌
Hyderabad Drugs: విదేశీయుడి పొట్టలో డ్రగ్స్‌.. శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌!

Cocaine worth Rs 12 crore seized at Shamshabad Airport: మాదకద్రవ్యాల విషయంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అక్రమ రవాణా మాత్రం అడగడం లేదు. నిత్యం దేశంలో ఏదోచోట డ్రగ్స్‌ వ్యవహారం బయటపడుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకుంటున్నారు. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ విదేశీయుడి పొట్ట నుంచి రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... 

టాంజానియాకు చెందిన సాలె అనే వ్యక్తి ఈ నెల 21న జొహానెస్‌బర్గ్‌ నుంచి ప్రిటోరియాకు వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ముందు డ్రగ్స్‌ క్యాప్సూల్స్‌ను మింగేశాడు. మూడు రోజల తర్వాత అతడు భాగ్యనగరంలోని ఓ తెలియని వ్యక్తికి అప్పజెప్పాల్సి ఉంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శంషాబాద్‌ విమాశ్రయంకు చేరుకున్న సాలెను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న 22 కొకైన్‌ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుడు తన కడుపులో కొకైన్‌ క్యాప్సుల్స్‌ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

దాంతో డీఆర్‌ఐ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల వ్యవధిలో అతడి పొట్టలోంచి వైద్యులు 58 కొకైన్‌ క్యాప్సుల్స్‌ను వెలికితీశారు. మొత్తంగా నిందితుడి నుంచి 79 కొకైన్ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1.157 కిలోల కొకైన్‌ విలువ సుమారు రూ.11.57 కోట్లు ఉంటుందని అంచనా. టాంజానియా వ్యక్తిపై కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. అతడిని రిమాండ్‌కి తరలించారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో ఇంత మొత్తంలో కొకైన్‌ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. 

Also Read: Acharya Ticket Price Hike: ఆచార్య టికెట్ల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ సర్కార్.. కండిషన్ అప్లై!

Also Read: RCB Playing XI vs RR: అనుజ్ రావత్ ఔట్.. విరాట్ కోహ్లీ డౌట్! రాజస్థాన్‌తో తలపడే బెంగళూరు జట్టిదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News