KA Paul Hot Comments: ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.

Written by - Attili | Edited by - Attili | Last Updated : Jun 4, 2022, 08:59 PM IST
  • ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
  • హాట్ కామెంట్స్ చేసిన కేఏ పాల్
  • అత్యాచారం ఘటనపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లా: కేఏ పాల్
KA Paul Hot Comments: ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.

కేఏ పాల్.. ఒక మతాధిపతిగానో.. రాజకీయ నేతగానో కాకుండా తాను చేసే హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను శాసించే శక్తి తనకు ఉందంటూ పదే పదే చెప్పుకునే కేఏ పాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రజాశాంతి పార్టీ ద్వారా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా..పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది తామేనన్న అత్మవిశ్వాసం ఆయనలో తొణికిసలాడుతూ ఉంటుంది.

 తాజాగా తెలంగాణ రాజకీయాలపై కేఏ పాల్ హాట్‌ కామెంట్స్ చేశారు. తనతో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి కొంత మంది అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఛాన్స్ దొరకడం కష్టమంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేఏ పాల్ కామెంట్స్‌తో చర్చ మొదలైంది. ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్‌.. కొందరు  సిట్టింగ్‌లను మార్చాలంటూ కేసీఆర్‌కు గతంలో నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయితే అలా తమకు సీటు దక్కదని భావిస్తున్న వారు నిజంగానే ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ప్రజాశాంతి పార్టీకి అంత సీన్ లేదనీ.. కేఏ పాల్ వ్యాఖ్యలు తూచ్‌ అంటూ కొట్టి పారేసేవారూ ఉన్నారు. కానీ పాల్ కాన్ఫిడెన్స్‌ చూస్తే ఎవరైనా నిజమేనని నమ్మాల్సిందే. తాను అవకాశం ఇస్తాననీ ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరాలంటూ కేఏ పాల్ ఆహ్వానించారు.

మరోవైపు హైదరాబాద్‌లో సంచలనంగా మారిన మైనర్ రేప్‌ ఘటనపైనా పాల్ వ్యాఖ్యలు చేశారు. రేప్ ఘటన సిగ్గుచేటన్నారు. దీని వెనకు ఉన్న కొందరికి రాజకీయ అండదండలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాన్ని తాను కేంద్ర హోంమంత్రితో పాటు సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏ పేపర్ చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే కనిపించాయనీ.. శ్రీకాంత్ తో పాటు తెలంగాణ కోసం అమరులైన వారి ఫోటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మోసగాళ్లు, దుర్మార్గుల ఫోటోలు ఫ్రంట్‌ పేజీలో వేయడం సిగ్గు చేట్టన్నారు.

శ్రీకాంతచారి తండ్రికి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారనీ.. ఆయనకు ఏమైనా జరిగితే దానికి కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాలన్నారు. తాను అమరవీరుల కుటుంబాలకు చెందిన వారికి టికెట్లు ఇస్తానన్నారు. సిరిసిల్లలో లాగా తనపై మరోసారి దాడి చేస్తే.. వదిలిపెట్టను ఖబద్దార్ అంటూ కేఏ పాల్ హెచ్చరించారు. కేఏ పాల్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

Also read: Palmistry: మీ చేతి రేఖలపై ఆ వృత్తం ఉందా..అయితే అంతులేని సంపదే మీకు

Also read:Subramanian Swamy: అమిత్‌ షాకు హోం కాదు..క్రీడా శాఖ ఇవ్వాలి..సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News