Kishan Reddy Crucial Comments on Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో కల్వకుంట్ల కవిత ప్రమేయం కూడా ఉందని సీబీఐ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని దఫాలుగా కవితను ప్రశ్నించింది కూడా.
అయితే కావాలని కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు కవితను ఈ కేసులోకి లాగారని బిఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్న క్రమంలో ఈ లిక్కర్ స్కాం మీద కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్లని మేము రమ్మని పిలవలేదని పేర్కొన్న ఆయన దర్యాప్తు జరుగుతుంటే కలవకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ దర్యాప్తు అనంతరం వారు నిప్పులా బయటకు వస్తారో లేక లిక్కర్ బయటకు వస్తుందో మాకు తెలియదని పేర్కొన్న కిషన్ రెడ్డి అసలు ఈ కేసు దర్యాప్తు తెలంగాణ వ్యక్తుల కోసం ప్రారంభించలేదని పేర్కొన్నారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ వాళ్ళ పేర్లు వచ్చాయని అయితే వీళ్ళు మాత్రం కావాలని కేంద్రం కక్ష కట్టింది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు అని అన్నారు. ఇక టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి కాదు ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నా మాకు నష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక గజ్వేల్, సిద్దిపేట వంటి ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చుపెడుతోంది అని ప్రశ్నించిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పథకం నిధులు మళ్ళించి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తోందని జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొందని ఆయన విమర్శించారు. ఇక కేసీఆర్ వైఖరి ఇలాగే కొనసాగితే తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఆయన హెచ్చరించారు.
Also Read: Veera Simha Reddy Pre Release: ఒంగోలులోనే వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook