Rythu Bharosa Applications: ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రేవంత్ రెడ్డిది మాటల, కోతల ప్రభుత్వమని ప్రజలకు అర్థమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసాకు దరఖాస్తుల పేరుతో రైతులను మరో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి అనేక వాయిదాలతోపాటు కోతలు విధించారని గుర్తుచేశారు. రైతు భరోసాను కూడా అలాగే చేసి పెద్ద ఎత్తున రైతులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'
రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంపై కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతు భరోసాకి దరఖాస్తు పేరుతో అనేక కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. రుణమాఫీ వాయిదా మీద వాయిదా వేస్తూ అనేక కోతలు విధించారు. రైతు భరోసానూ కూడా అలాగే చేస్తున్నారు' అని ఆరోపించారు.
Also Read: KT Rama Rao: 'బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. మీకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా'
'వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలి' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్న వారు ఎందుకు ఇవ్వడం లేదు' అని ప్రశ్నించారు. 'రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు రూ.15 వేలు ప్రతి ఏటా ఇవ్వాలని కోరారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను నీరు గార్చే ప్రయత్నం చేస్తోంది. కనీస మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కేంద్రం కొంటుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చెప్పాలి' బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై దాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతు వ్యతిరేక చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. రైతు భరోసాకి దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు. ఈ నెల రెండో వారంలో జిల్లా కలెక్టర్లు, ఎమ్మార్వోలకు రైతుల పక్షాన వినతి పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook