తెలంగాణ కేబినెట్ ముహుర్తం ఖరారైన నేపథ్యంలో ..ఇప్పుడు చర్చంతా కేబినెట్ కూర్పు..అలాగే బెర్తులో ఎవరెవరికి స్థానం దక్కుతుందనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి బుల్లి కేబినెట్ ఏర్పాటు చేసి లోక్ సభ ఎన్నికల తర్వాత కేబినెట్ ను మరింత విస్తరించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో 8 నుంచి 10 మందికి మాత్రమే చోటు కల్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
పాత వారికి చెక్ ?
గత ప్రభుత్వ అనుభావాలను దృష్ట్యా... కొందరు పాత వారిపై వేటు వేసి.. కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పంచాయితీ పోరులో మంచి ఫలితాలు సాధించిన వారికి కేబినెట్ బెర్తులో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్ధి సామర్ధ్యంతో పాటు పార్టీ పట్ల విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే కేబినెట్ నుంచి వేటు పడే సీనియర్ అభ్యర్ధులకు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దించాలని ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికలతో లింక్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్... కేబినెట్ విస్తరణకు పంచాయితీ పోరుతో లింక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పంచాయితీ పోరు ముగిసింది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథంలో కేసీఆర్ ప్రస్తుతానికి బుల్లి కేేబినెట్ ఏర్పాటు చేసి ..లోక్ సభ ఎన్నికల తర్వాత మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇలా కేసీఆర్ తన కేబినెట్ విస్తరణను లోక్ సభ ఎన్నికలతో ముడిపెట్టారని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.