హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

Gas Cylinder Explosion in Nanakramguda: నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సిలిండర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 10:10 AM IST
  • హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు
    ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి గాయాలు
    పేలుడు ధాటికి ధ్వంసమైన భవనం
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

Gas Cylinder Explosion in Nanakramguda: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి (LPG cylinder blast) ఒకరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి పెద్ద శబ్దంతో భవనం ధ్వంసమవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

ఈ ఏడాది ఆగస్టులో ధూల్‌పేటలోనూ గ్యాస్ సిలిండర్ పేలుడు (Gas Cylinder Explosion) ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గోదాంలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మానవ్ సింగ్‌(24), నీరజ్‌ సింగ్‌(48)లుగా గుర్తించారు.

Also Read:బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, భారీ వర్షాలు తప్పవు

నాలుగు రోజుల క్రితం ఏపీలోని విశాఖపట్నంలోనూ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఇందిరా కాలనీలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాద ఘటనలో భవనం ధ్వంసమవగా ఇద్దరు గాయపడ్డారు. వెంటనే ఆ ఇద్దరినీ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని అజాద్ నగర్‌లోనూ గ్యాస్ సిలిండర్ పేలుడు (Gas Cylinder Explosion) ఘటన చోటు చేసుకోగా... ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News