Hyderabad Metro: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు గతంలో ఎప్పుడు లేని విధంగా మండి పోతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లాలి అంటే భయపడాల్సిన పరిస్థితి. ఉద్యోగస్తులు... రెగ్యులర్ వ్యాపారస్తులు ఇతర పనులకు వెళ్లాల్సిన వారు ఎండ ఎంత కొట్టినా.. వర్షం కుండపోతగా పడినా కూడా చేసేది లేక వారి వారి పనులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఉదయం 10 గంటలు.. ఆ తర్వాత ప్రయాణించాల్సిన వారు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ రోడ్లపై మద్యాహ్నం సమయంలో వాహనాలు కనిపించడం లేదు. అందులో ఎక్కువ శాతం మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దూరం ఎంతైనా కూడా మెట్రోలో ప్రయాణించి ఎండ దెబ్బ నుండి తప్పించుకుంటున్నారు.
హైదరాబాద్ జనాలు ఎండ దెబ్బ తప్పించుకునేందుకు మెట్రో ను ఆశ్రయిస్తూ ఉన్న ఈ సమయంలో అక్కడ కూడా కష్టాలు తప్పడం లేదు. రద్దీ సమయంలో ముఖ్య స్టేషన్స్ లో కనీసం కాలు పెట్టడానికి కూడా స్థానం ఉండటం లేదు. దాంతో టికెట్ల రేట్లు పెంచడంతో పాటు గతంలో ఉచితంగా ఇచ్చిన మెట్రో సేవలను కూడా తొలగించారు. ముఖ్యంగా పార్కింగ్ ను గతంలో ఉచితంగా అందించారు. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో రేటు పెట్టడంతో మెట్రో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో లో ప్రయాణించేందుకు భారీ మొత్తంలో టికెట్ రేటు పెట్టడంతో పాటు.. పార్కింగ్ కోసం మరికొంత మొత్తంను చెల్లించాల్సి రావడం దారుణం అంటూ హైదరాబాద్ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో ప్రయాణికులు రద్దీ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఆ సమయంలో వెంట వెంటనే మెట్రో రైలు నడుపుతున్నారు. అయినా కూడా ఆ సమయంలో ప్రయాణికులకు బోగీలు సరిపోవడం లేదు అంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ మెట్రో స్టేషన్స్ లో రద్దీ వీడియోలను షేర్ చేసి ఇలా ఉన్నా కూడా మీరు బోగీలను ఎందుకు పెంచడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Here a the answer.
When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4— Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023
Also Read: Retirement Planning: ఈ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. మంచి లాభాలను పొందండి
మెట్రో ప్రారంభం అయిన సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ఉచితంగా పలు సేవలను అందించిన ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పుడు మాత్రం భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రయాణం వల్ల సమయం ఎక్కువ పట్టడంతో పాటు ఈ ఎండ కూడా దారుణంగా ఉండటంతో మెట్రో రైల్ ను ఆశ్రయిస్తే ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందని ఇటీవల మెట్రోలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సమ్మర్ మొత్తం కూడా మెట్రో లో భారీ ఎత్తున ప్రయాణికులు ప్రయాణించేందుకే ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: White Hair To Black Hair: రెండు వారాల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!, నమ్మట్లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook